మన సమాజం ఎంత అభివృద్ధి చెందినా ఇంకా మనం ఆడ పిల్లల భ్రుణ హత్యలు ఇంకా వింటూనే ఉన్నాం. అప్పట్లో మూడ విశ్వాసాలతో అధిక సంతానం, పేదరికంతో ఆడ శిశువులను వడ్లగింజ నోట్లో వేయడం, పుట్టిన వెంటనే పేగు ముడివేయకపోవడం, నిరాసక్తతతో సరిగా పాలివ్వకపోవడం వంటి చర్యలతో ఆడ శిశువుల మరణాలకు పాల్పడిన ఘటనలు ఎన్నో మనం విన్నాం ఇంకా వింటున్నాం. ఈ రోజుల్లో లింగ నిర్ధారణ పరీక్షల్లోనే తేల్చుకొని ఇంకా పుట్టాక ముందే చంపేస్తున్నారు. ఇప్పటికి మన రాష్ట్రం లో ఈ మధ్య చదివిన వార్తల ప్రకారం గిరిజనులు అధికంగా పిల్లలను కంటూ ఆడపిల్లలు పుడితే పురిట్లోనే చంపడం లేదా అమ్మకాలకు పాల్పడుతున్న తీరు చూస్తూనే ఉన్నాం.నవ మాసాలు మోసి కన్న తల్లికి కన్న పేగు బరువవుతున్న దుస్థితికి కారణాలేమైన ఈ రకమైన అకృత్యాలకు బలవుతున్నది మాత్రం ఆడశిశువులే. గిరిజనుల్లో ప్రబలంగా మగసంతానంపై ఉన్న మక్కువ ఆడిశిశువుల పాలిట శాపంగా మారి వారిని ఆడశిశువుల పట్ల వివక్షపూరితంగా ప్రవర్తించేలా పురిగొల్పుతుంది. ఇది ఒక్క గిరిజనుల్లో నే కాదు ఎక్కడ చుసిన ఇటువంటి సంఘటనలు కోకొల్లలు. ఇది ఇలానే కొనసాగుతే కొన్ని రోజుల తర్వాత ఆడ వాళ్ళ సంఖ్యా తగ్గుతూ పోతుందేమో. ఇప్పటి లెక్కల ప్రకారం చుసిన స్త్రీ , పురుష నిష్పతి చుస్తే స్త్రీల సంఖ్యా పురుషల కన్నా తక్కువే. ఈ హృదయం ద్రవించే వీడియోలు చూడండి..
2 comments:
ఇందులో వర్రీ అయ్యేదేముంది ? ఆడపిల్లలు తగ్గిపోతే ఒకమ్మాయినే నలుగురు మగవాళ్ళు చేసుకుంటారు. అప్పుడైనా ఆడపిల్లల్ని కనాల్సిన అగత్యాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకుంటారు. శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు. అయినా ఈ శతాబ్దాంతానికల్లా ప్రపంచంలో భారీగా తగ్గిపోయేది ఆడజనాభా కాదు, మగజనాభాయేనని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు కదా ! (ఏడుగురు ఆడవాళ్ళకి ఒక మగవాడు ఉంటాడంట) గ్లోబల్ వార్మింగ్, కాలుష్యం వల్ల ఇలా జరగబోతోందని అంటున్నారు.
Hi Madhavi,
This is really bad ,but u forgot to mention one Section of People who also contribute to this,NRI's.
Many NRI's Feel ashame if they have girl.
Post a Comment