Tuesday, November 23, 2010

SAVE THE GIRL CHILD - DISAPPEARING DAUGHTERS

మన సమాజం ఎంత అభివృద్ధి చెందినా ఇంకా మనం ఆడ పిల్లల భ్రుణ హత్యలు ఇంకా వింటూనే ఉన్నాం. అప్పట్లో మూడ విశ్వాసాలతో  అధిక సంతానం, పేదరికంతో  ఆడ శిశువులను వడ్లగింజ నోట్లో వేయడం, పుట్టిన వెంటనే పేగు ముడివేయకపోవడం, నిరాసక్తతతో సరిగా పాలివ్వకపోవడం వంటి చర్యలతో ఆడ శిశువుల మరణాలకు పాల్పడిన ఘటనలు ఎన్నో మనం విన్నాం ఇంకా వింటున్నాం. ఈ రోజుల్లో లింగ నిర్ధారణ పరీక్షల్లోనే తేల్చుకొని ఇంకా పుట్టాక ముందే చంపేస్తున్నారు. ఇప్పటికి మన రాష్ట్రం లో ఈ మధ్య చదివిన వార్తల ప్రకారం గిరిజనులు  అధికంగా పిల్లలను కంటూ ఆడపిల్లలు పుడితే పురిట్లోనే చంపడం లేదా అమ్మకాలకు పాల్పడుతున్న తీరు చూస్తూనే ఉన్నాం.నవ మాసాలు మోసి కన్న తల్లికి కన్న పేగు బరువవుతున్న దుస్థితికి కారణాలేమైన ఈ రకమైన అకృత్యాలకు బలవుతున్నది మాత్రం ఆడశిశువులే. గిరిజనుల్లో ప్రబలంగా మగసంతానంపై ఉన్న మక్కువ ఆడిశిశువుల పాలిట శాపంగా మారి వారిని ఆడశిశువుల పట్ల వివక్షపూరితంగా ప్రవర్తించేలా పురిగొల్పుతుంది. ఇది ఒక్క గిరిజనుల్లో నే కాదు ఎక్కడ చుసిన ఇటువంటి సంఘటనలు కోకొల్లలు. ఇది ఇలానే కొనసాగుతే కొన్ని రోజుల తర్వాత ఆడ  వాళ్ళ సంఖ్యా తగ్గుతూ పోతుందేమో. ఇప్పటి లెక్కల ప్రకారం చుసిన స్త్రీ , పురుష నిష్పతి చుస్తే స్త్రీల సంఖ్యా పురుషల కన్నా తక్కువే. ఈ హృదయం ద్రవించే వీడియోలు  చూడండి..


Innocent Dream - Female foeticide




Sunday, November 7, 2010

తు జానేన....hindi song by english girl

అజబ్  ప్రేమ్  కి గజబ్ కహాని అన్న హిందీ సినిమా లోని  " కైసే బతాయే..క్యోం తుజకో చాహే" అన్న పాటను ఒక ఇంగ్లిష్ అమ్మాయి పాడితే ఎలా ఉంటుందో చుడండి.సరదాగా నాకయితే నచ్చింది.





ఒరిజినల్ పాట రన్బీర్ కపూర్ మరియు కత్రిన కైఫ్ ల పై చిత్రీకరించిన ఈ పాట ఇర్షాద్ కమిల్ రాయగా, అతిఫ్ అస్లాం పాడారు.  ఆ పాట వీడియో చూసి మీరు  ఎంజాయ్ చేయండి.