మన సమాజం ఎంత అభివృద్ధి చెందినా ఇంకా మనం ఆడ పిల్లల భ్రుణ హత్యలు ఇంకా వింటూనే ఉన్నాం. అప్పట్లో మూడ విశ్వాసాలతో అధిక సంతానం, పేదరికంతో ఆడ శిశువులను వడ్లగింజ నోట్లో వేయడం, పుట్టిన వెంటనే పేగు ముడివేయకపోవడం, నిరాసక్తతతో సరిగా పాలివ్వకపోవడం వంటి చర్యలతో ఆడ శిశువుల మరణాలకు పాల్పడిన ఘటనలు ఎన్నో మనం విన్నాం ఇంకా వింటున్నాం. ఈ రోజుల్లో లింగ నిర్ధారణ పరీక్షల్లోనే తేల్చుకొని ఇంకా పుట్టాక ముందే చంపేస్తున్నారు. ఇప్పటికి మన రాష్ట్రం లో ఈ మధ్య చదివిన వార్తల ప్రకారం గిరిజనులు అధికంగా పిల్లలను కంటూ ఆడపిల్లలు పుడితే పురిట్లోనే చంపడం లేదా అమ్మకాలకు పాల్పడుతున్న తీరు చూస్తూనే ఉన్నాం.నవ మాసాలు మోసి కన్న తల్లికి కన్న పేగు బరువవుతున్న దుస్థితికి కారణాలేమైన ఈ రకమైన అకృత్యాలకు బలవుతున్నది మాత్రం ఆడశిశువులే. గిరిజనుల్లో ప్రబలంగా మగసంతానంపై ఉన్న మక్కువ ఆడిశిశువుల పాలిట శాపంగా మారి వారిని ఆడశిశువుల పట్ల వివక్షపూరితంగా ప్రవర్తించేలా పురిగొల్పుతుంది. ఇది ఒక్క గిరిజనుల్లో నే కాదు ఎక్కడ చుసిన ఇటువంటి సంఘటనలు కోకొల్లలు. ఇది ఇలానే కొనసాగుతే కొన్ని రోజుల తర్వాత ఆడ వాళ్ళ సంఖ్యా తగ్గుతూ పోతుందేమో. ఇప్పటి లెక్కల ప్రకారం చుసిన స్త్రీ , పురుష నిష్పతి చుస్తే స్త్రీల సంఖ్యా పురుషల కన్నా తక్కువే. ఈ హృదయం ద్రవించే వీడియోలు చూడండి..
Tuesday, November 23, 2010
Sunday, November 7, 2010
తు జానేన....hindi song by english girl
అజబ్ ప్రేమ్ కి గజబ్ కహాని అన్న హిందీ సినిమా లోని " కైసే బతాయే..క్యోం తుజకో చాహే" అన్న పాటను ఒక ఇంగ్లిష్ అమ్మాయి పాడితే ఎలా ఉంటుందో చుడండి.సరదాగా నాకయితే నచ్చింది.
ఒరిజినల్ పాట రన్బీర్ కపూర్ మరియు కత్రిన కైఫ్ ల పై చిత్రీకరించిన ఈ పాట ఇర్షాద్ కమిల్ రాయగా, అతిఫ్ అస్లాం పాడారు. ఆ పాట వీడియో చూసి మీరు ఎంజాయ్ చేయండి.
Saturday, October 30, 2010
వంటిల్లు
మనం రోజు చూసే వంటిల్లు ను విమల గారు కొత్త దృష్టి తో చూశారు. నాకు నచ్చిన కవిత ఇది. మనకు తెలిసిన వంటిల్లె, మనకు తెలిసిన పదాలే, కానీ ఎందుకనో కొత్తగా అనిపిస్తున్నాయి. వంటిట్లో పని చేసేది అమ్మ ఒక్కత్తే. అమ్మకు విశ్రాంతి సెలవు ఏవి లేవు. అమ్మ శ్రమ ఫలితాన్ని అందరు భోమ్చేసేవారే." వంటిటి తనాన్ని ఇక్కడే నేర్పారు నాకు/ మా అమ్మ, అమ్మమ్మ,/ ఇంట్లో అమ్మలంతా ఇక్కడే స్త్రీలయ్యరట/" అని వంటిల్లును ఆడపిల్లలను తయారు చేసే కర్మాగారం లా ఎంత చక్కగా చెప్పింది. ఇంకా .మన రక్తం పీల్చేసి , మన ఆశల్ని , కలల్ని కాజేసి .కొద్ది కొద్దిగా జీవితాంతం పీక్కు తింటున్నరాకాసి అయిన ఈ వంటింటిని ద్వంసం చేద్దాము , వంటరి వంట గదులను కుల్చేద్దాం అంటూ పిలుపునిచ్చే ఈ కవిత ని .... మీరు చదవండి. విమల గారి వంటిల్లు కవిత్వం.
రుచులు రుచులుగా పరిమళాన్ని వెదజల్లుతూ
తెరచిన తినుబండారాల దుకాణంలా
ఎంత నోరురిస్తుందో !
తాలింపు ఘుమాయిన్పులతో
పూజ మందిరం అగరొత్తుల సువాసనలతో
మా వంటిల్లు నిత్యం శ్వాసిస్తూ ఉంటుంది.
వసారాలో చల్ల చిలికే చప్పుడుతోనో
అంట్ల గిన్నెలు తోమే చప్పుడుతోనో
రోజు ఉదయమే మా వంటిల్లు మేల్కొంటుంది
అలికి ముగ్గులు దిద్దిన పొయ్యి
మండేందుకు ముస్తాబవుతుంది
వంటింటి పోపు డబ్బాలో చిల్లర పైసలు
దాచుకు తిన్న మిటాయి ఉండలు
పప్పు బెల్లలతో ఉత్తుత్తి వంటా-వడ్డనలు
అమ్మ నాన్న ఆటలు
ఈ వంటిల్లోక వదలని మొహమై
నా బాల్యాన్నంత చుట్టేసుకుంది .
నాకు మా వంటిల్లోక అద్బుత మాయా బజార్
ఇప్పుడు వంటిల్లోక ఆట స్థలం కాదు .
మెల్లగా బాల్యపు చాయలు వదిలిపెడుతున్డగానే
ఇక్కడే నన్ను తీర్చి దిద్దటం మొదలయ్యింది
"వంటింటి తనాన్ని" ఇక్కడే నేర్పారు నాకు
మా అమ్మ, మా అమ్మమ్మ,
ఇంట్లో అమ్మలంతా ఇక్కడే "స్త్రీ" లయ్యారట
గిన్నెలు, డబ్బాలు, బస్తాలతో
రకరకాల శవాలు నిండిన శ్మశానంలా
మా వంటిల్లు -
తడి కట్టెల పొగ మేఘాల మధ్య
మా వంటిల్లు వేలాడుతూ ఉంటుంది
భయం, భయంగా నిశ్శబ్దంగా, నిరాశగా
మా అమ్మొక ప్రేతంలా తేలుతూ ఉంటుందిక్కడ
అస్సలు మా అమ్మే నడుస్తున్న వంట గదిలా ఉంటుంది,
ఏడ్చి ఏడ్చి ఆమె కళ్ళు ఎక్కడో కారి పోయాయి.
తోమి తోమి ఆమె చేతులు అరిగి పోయాయి
మా అమ్మకు చేతులు లేవు
ఆమెను చుస్తే
ఒక గరిటగానో, పెనం లానో
మా వంటింటిని అలంకరించిన ఓ పరికరం లానో ఉంటుంది.
ఒక్కో సారి ఆమె మండుతున్న పొయ్యిలా కూడా ఉంటుంది.
అప్పుడు బంది అయిన పులిలా ఆమె
వంట గదిలో అశాంతిగా తిరుగుతుంది .
నిస్సహాయతతో గిన్నెలు తిప్పితే చాలు
వంట సిద్దం అంటారంతా !
తినేందుకు తప్ప ఇటుకేసి రారు ఎవ్వరూ
ఈ వంటింటి సామ్రాజ్యానికి మా అమ్మే రాణి
అయనా చివరకు వంటింటి గిన్నేలన్నింటి పైనా
మా నాన్న పేరే !
అదృష్ట వశాత్తూ నేనో మంచి వంటిట్లో పడ్డనన్నరంత !
గ్యాసు, గ్రైన్దర్లు, సింకులు , టైల్స్ ...
అమ్మలా గారెలు, అరిసెలు కాక
ఇప్పుడు కేకులు , పుడ్డింగులు చేస్తున్నాను నేను
ఇంకా గిన్నెలపై పేర్లు మాత్రం నా భర్తదే
కుక్కర్ కూత తోనో , గ్రైండర్ మోత తోనో
నా వంటిల్లు మేల్కొంటుంది .
నేనొక అలంకరించిన వంట గదిలా
కీ ఇచ్చిన బొమ్మలా ఇక్కడ తిరుగుతూ ఉంటాను
నా వంటిల్లోక యంత్రశాల ల ఉంది
రకరకాల చప్పుళ్ళతో ఈ వంటిల్లోక కసాయి
దుకాణంలా ఉంది
కడిగిందే కడిగి ఏళ్ళ తరబడి , వండి ,వండి,
వడ్డిస్తూ ఎంగిళ్ళు ఎత్తెసుకుంటూ
చివరకు నా కలలలోను వంటిల్లె
కళాత్మకమయిన వంటింటి కలలు
మల్లె పూవుల్లోను పోపు వాసనలే !
ఈ వంటింటి ని తగలెయ్య
ఎంత అమానుష మయ్యిందీ వంట గది !
మన రక్తం పీల్చేసి , మన ఆశల్ని , కలల్ని కాజేసి
కొద్ది కొద్దిగా జీవితాంతం పీక్కు తింటున్న
రాకాసి గదా ఈ వంటిల్లు
వంటింటి సంస్కృతి ; వంటింటి ముచ్చట్లు
వంటలక్కలమైన మనం
మనం ఏమయినా మన అంతిమ కర్తవ్యం
గరిట తిప్పడం గా చేసిన ఈ వంటిళ్ళను
ద్వంసం చేద్దాం రండి !
ఇక గిన్నెలపై ఎవ్వరి పేర్లు వద్దూ
వేర్వేరు స్వంత పొయ్యిలను
పునాదులతో సహా తవ్వి పొద్దం రండి!
మళ్లి మన పాపలు ఈ వంటరి వంటిళ్ళలోకి
అడుగిడపోతున్నారు.
మన పిల్లల కోసం
వంటరి వంట గదులు కూల్చేందుకు రండి
Friday, August 27, 2010
స్త్రీ
స్త్రీ ఎప్పటికి ఒంటరిదే, ఇది నిజం కానీ ఎవరు నమ్మరు, స్త్రీ లేనిదే సృష్టి లేదు. అందరికి అన్ని సర్దుబాటు చేస్తూ అన్ని సమకురుస్తూ అందులోనే తన సంతోషం చూసుకుంటుంది. నాకోసం నేను అంటూ ప్రత్యేకంగా ఏమి కోరుకోదు. పెళ్లి అయిన నాటినుంచే అత్త గారింట్లో ఉన్న వారందరికి ,ఏమేమి కావాలో తెలుసుకొని మసలుకుంటుంది. వాళ్ళకు కావలసినవి చేసి పెడుతూ అందులోనే ఆనందం పొందుతుంది. నా సంతోషం,నాకుకావలసినవి అంటూ ఏమి కోరుకోదు. ఇంకా పిల్లలు పుట్టినతర్వత వాళ్ళే తన జివితం అనుకుంటుంది. వాళ్ళ ఆలనా, పాలనా చదివించడం,వారి మంచి భవిష్యతు కోసం తాపత్రయపడుతుంది. అన్ని పనులు దగ్గర ఉండి తనే స్వయంగా చూసుకుంటుంది.పిల్లలకు,భర్తకు,అత్త,మామలు స్వయంగా తనే అన్ని అందిస్తూ సేవలుచేస్తుంది .
కాని ఈ స్త్రీ ఇంట్లో ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో ఒక్కసారి ఆలోచించండి. ఉదయమే అందరి కంటే మొదలే లేచి, తిరిగి అందరు పడుకున్నాక తానూ పడుకునే వరకు ఎన్ని ఇబ్బందులు ఫేస్ చేస్తుంది.ఉదయమంతా పని చేసుకుని, ఎవ్వరు ఉన్న, సాయం రారు. తను ఒక్కత్తే అన్ని, అందరి పనులు ముగించుకొని కాస్త తీరిక సమయంలో టీవీ చూద్దామని కూర్చుంటే remote అత్తగారి దగ్గరో, మామగారి చేతిలోనో వుంటుంది.ఏదైనా కాస్త ఇంటరెస్ట్ గా అనిపించి చూస్తుంటే ,ఛానల్ మారుతుంది.చేతిలో remote వుంటే 36 చానల్స్ మారుతూ వుంటై.
సాయంత్రమైంది అంటే పిల్లలు స్కూల్ నుండి వస్తే వారితోనే సరిపోతుంది. కాని వాళ్ళు కాలేజీ కి వెళ్ళే పిల్లలయితే ఎ హాస్టల్ లోనో చేర్పిస్తే , అపుడు మొదలవుతుంది నిజమైన ఒంటరి తనం.వాళ్లే జీవితం అనుకుంటూ బ్రతికిన వారికి నిజంగా చాల బోర్ మొదలువుతుంది. ఆ ఒంటరితనం తో రోజు చేసే పని అయినా చాల చిరాకు అనిపిస్తుంది. ఎవరైన మనపనులు చేస్తే బాగుండు అని అనిపిస్తుంది. చేయించుకోవడమే కానీ చేసే అలవాటులేక ఎవరు ఆ పని చేయరు. కాని మనకు తప్పదుకదా. ఎప్పుడైనా TV ముందు కూర్చుంటే ఏదో పాపం బోర్ కొట్టి చుస్తుందిలే చూడనిలే అని అనుకోరు, వారికి నచ్చిన వాటికోసం చానల్స్ మారుతూనే వుంటాయి.. ఇంకా చేసేది ఏమి లేక కాసేపు కుర్చోని లేవడమే.
భర్త ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తుంది. ఆఫీసు లో చాల అలసి పోయి ఇంటికి వస్తారు.ఆయనకు కూడా పిల్లలు ఇంట్లో లేక బోర్ గా ఫీల్ అవుతుటారు. కానీ మగవారు కనుక తొందరగా పని లో పడి వేరే అలవాట్లు చేసుకుంటూ మరిచి పోవడానికి ప్రయత్నిస్తారు. .తనపనిలో తను మునిగిపోతువుంటారు. చివరకు మిగిలేది ఒంటరి ఆడది . ఒక " స్త్రీ " జీవితం ఇలా చప్పగా సాగిపోతువుంటుంది .ఎవరితో ఎ గొడవలు వుండవు. కానీ ఇల్లంతా మౌనం పాటిస్తున్న్నట్లుగా నిశ్శబ్దం. మనసులో ఒంటరితనం.
.అందుకే స్త్రీ మొదటి నుంచి కూడా తన వ్యక్తిత్యం తనకు వుండే లా పెరగాలి. ఎట్టి పరిస్తితుల్లో కూడా తన వ్యక్తిత్వాన్ని వదులుకోకూడదు. చిన్నప్పటినుండి ఆడపిల్లలకు individuality ఉండేలా పెంచాలి.ఆడపిల్లలను ధైర్యంగా ,తన ఆలోచనలు దైర్యంగా చెప్పే స్వేచ్చ ఇస్తూ ఎటువంటి పొరపాట్లు చేయకుండా జాగ్రతగా పెంచాలి. లేక పొతే సగం జివితం వరకే జీవితం మీద విరక్తికలిగి బ్రతకడమే వేస్ట్ అని పిస్తుంది. ఎందుకోసం బ్రతుకుతున్నామో అర్ధం కాకుండా ఒంటరి జీవితాన్ని జీవించడం చాల కష్టమౌతుంది. స్త్రీ తను చదువుకొని ,తన కాళ్ళ మీద తానూ నిలబడగలిగి, తన స్వంత ఆలోచనలతో ఈ సమాజం లో ముందుకు పోయేలా. ఇలా అందరిలో ఉండి కుడా ఒంటరి జీవితాలు అనుభవించకుండా తన వ్యక్తిత్వాని కాపాడుకుంటూ జీవించడం సాద్యమంటార?
Subscribe to:
Posts (Atom)