Friday, August 27, 2010

స్త్రీ

స్త్రీ  ఎప్పటికి ఒంటరిదే, ఇది నిజం కానీ ఎవరు నమ్మరు, స్త్రీ లేనిదే సృష్టి  లేదు. అందరికి అన్ని సర్దుబాటు చేస్తూ అన్ని సమకురుస్తూ  అందులోనే తన సంతోషం చూసుకుంటుంది. నాకోసం నేను అంటూ ప్రత్యేకంగా ఏమి కోరుకోదు. పెళ్లి అయిన నాటినుంచే అత్త  గారింట్లో ఉన్న వారందరికి ,ఏమేమి కావాలో తెలుసుకొని  మసలుకుంటుంది. వాళ్ళకు కావలసినవి చేసి పెడుతూ  అందులోనే ఆనందం పొందుతుంది. నా సంతోషం,నాకుకావలసినవి అంటూ ఏమి కోరుకోదు. ఇంకా పిల్లలు పుట్టినతర్వత వాళ్ళే  తన జివితం అనుకుంటుంది. వాళ్ళ ఆలనా, పాలనా చదివించడం,వారి  మంచి భవిష్యతు కోసం తాపత్రయపడుతుంది. అన్ని పనులు దగ్గర ఉండి తనే స్వయంగా చూసుకుంటుంది.పిల్లలకు,భర్తకు,అత్త,మామలు స్వయంగా తనే అన్ని అందిస్తూ సేవలుచేస్తుంది .

కాని ఈ స్త్రీ ఇంట్లో ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో ఒక్కసారి ఆలోచించండి. ఉదయమే అందరి కంటే మొదలే లేచి, తిరిగి అందరు పడుకున్నాక తానూ పడుకునే వరకు ఎన్ని ఇబ్బందులు ఫేస్ చేస్తుంది.ఉదయమంతా పని చేసుకుని, ఎవ్వరు ఉన్న, సాయం రారు. తను ఒక్కత్తే అన్ని, అందరి పనులు ముగించుకొని    కాస్త తీరిక సమయంలో టీవీ  చూద్దామని  కూర్చుంటే remote అత్తగారి దగ్గరో, మామగారి చేతిలోనో వుంటుంది.ఏదైనా కాస్త ఇంటరెస్ట్ గా అనిపించి చూస్తుంటే ,ఛానల్ మారుతుంది.చేతిలో remote  వుంటే 36  చానల్స్ మారుతూ వుంటై.   

 సాయంత్రమైంది అంటే పిల్లలు స్కూల్ నుండి వస్తే వారితోనే సరిపోతుంది.  కాని వాళ్ళు కాలేజీ కి వెళ్ళే పిల్లలయితే  ఎ హాస్టల్ లోనో చేర్పిస్తే , అపుడు మొదలవుతుంది నిజమైన ఒంటరి  తనం.వాళ్లే  జీవితం అనుకుంటూ బ్రతికిన వారికి నిజంగా  చాల బోర్ మొదలువుతుంది.   ఆ ఒంటరితనం  తో రోజు చేసే పని అయినా  చాల చిరాకు అనిపిస్తుంది. ఎవరైన  మనపనులు చేస్తే బాగుండు అని అనిపిస్తుంది.  చేయించుకోవడమే  కానీ  చేసే అలవాటులేక ఎవరు ఆ పని చేయరు. కాని మనకు తప్పదుకదా. ఎప్పుడైనా TV   ముందు కూర్చుంటే ఏదో పాపం బోర్ కొట్టి చుస్తుందిలే చూడనిలే  అని అనుకోరు, వారికి  నచ్చిన వాటికోసం చానల్స్ మారుతూనే వుంటాయి.. ఇంకా చేసేది ఏమి లేక కాసేపు కుర్చోని లేవడమే.  

భర్త ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తుంది.  ఆఫీసు లో చాల అలసి పోయి ఇంటికి వస్తారు.ఆయనకు కూడా పిల్లలు ఇంట్లో లేక బోర్ గా ఫీల్ అవుతుటారు. కానీ మగవారు కనుక తొందరగా పని లో పడి వేరే అలవాట్లు చేసుకుంటూ  మరిచి పోవడానికి ప్రయత్నిస్తారు.  .తనపనిలో తను  మునిగిపోతువుంటారు. చివరకు మిగిలేది  ఒంటరి ఆడది . ఒక "  స్త్రీ " జీవితం ఇలా చప్పగా సాగిపోతువుంటుంది .ఎవరితో  ఎ గొడవలు వుండవు. కానీ ఇల్లంతా  మౌనం పాటిస్తున్న్నట్లుగా నిశ్శబ్దం. మనసులో ఒంటరితనం. 

.అందుకే స్త్రీ మొదటి నుంచి కూడా తన వ్యక్తిత్యం  తనకు వుండే లా పెరగాలి. ఎట్టి పరిస్తితుల్లో  కూడా తన  వ్యక్తిత్వాన్ని  వదులుకోకూడదు. చిన్నప్పటినుండి ఆడపిల్లలకు  individuality   ఉండేలా  పెంచాలి.ఆడపిల్లలను ధైర్యంగా ,తన ఆలోచనలు దైర్యంగా   చెప్పే స్వేచ్చ  ఇస్తూ ఎటువంటి పొరపాట్లు చేయకుండా జాగ్రతగా పెంచాలి. లేక పొతే సగం జివితం  వరకే జీవితం మీద విరక్తికలిగి బ్రతకడమే వేస్ట్ అని పిస్తుంది. ఎందుకోసం బ్రతుకుతున్నామో  అర్ధం కాకుండా ఒంటరి  జీవితాన్ని జీవించడం చాల కష్టమౌతుంది.   స్త్రీ తను  చదువుకొని ,తన కాళ్ళ మీద తానూ నిలబడగలిగి, తన స్వంత ఆలోచనలతో ఈ సమాజం లో ముందుకు పోయేలా. ఇలా అందరిలో ఉండి కుడా ఒంటరి జీవితాలు అనుభవించకుండా  తన వ్యక్తిత్వాని కాపాడుకుంటూ జీవించడం సాద్యమంటార?           

2 comments:

Pramida said...

మీరు చెప్పిన చివరి పార చాలా కరెక్ట్. ఇప్పుడు ఇది సాధ్యమే.. ఎంతసేపు వేరే వాళ్ళ కోసం పని చేసే స్త్రీలు తమ కోసం రోజులో గంటయిన కేటాయించుకోవాలి. మన జీవితం వేరే వారికి అంకితం అన్న ఆలోచన ధోరణి మారి, మన ఆనందం మనం చుసోకోవడంలో తప్పు లేదన్న ఆలోచన రావాలి.

భాస్కర రామిరెడ్డి said...

madhavi గారూ...,happy vinakayaka chavithi

హారం